Srirama Namam Maruvam Lyrics in Telugu | Ramadasu Keerthana Srirama Namam Maruvam Telugu Lyrics
- Suman Prasad
- Jul 15, 2023
- 1 min read
Updated: Jul 18, 2023

పల్లవి: శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునకు వెరువాం వెరువాం శ్రీ ॥
చరణము(లు): గోవిందునేవేళ గొలుతాం గొలుతాం దేవుని గుణములు దలుతాం దలుతాం శ్రీ ॥
విష్ణుకథలు చెవుల విందాం విందాం వేరేకథలు చెవుల మందాం మందాం శ్రీ ॥
రామదాసులు మాకు సారాం సారాం కామదాసులు మాకు దూరాం దూరాం శ్రీ ॥
నారాయణుని మేము నమ్మేం నమ్మేం నరులన్నింక మేము నమ్మాం నమ్మాం శ్రీ ॥
మాధవనామము మరువాం మరువాం మరి యమబాధకు వెరువాం వెరువాం శ్రీ ॥
అవనిజపతిసేవ మానాం మానాం మరియొక జోలంటే మౌనాం మౌనాం శ్రీ ॥
Comments