Sankata Nasana Ganesha Stotram
- Suman Prasad
- Jul 15, 2023
- 1 min read

చతుర్ధి రోజున కొంతమంది ఉపవాస దీక్ష ఆచరిస్తారు, ఆచరించలేని వారు, ఈ స్తోత్ర పఠనం చేయడం చాలా శుభకరం… సంకట నాశన గణేశ స్తోత్రం ప్రతీరోజూ పఠిస్తే శ్రీ గణేశుని అనుగ్రహం వలన అన్ని సంకటాలు తొలగిపోతాయని గనేశపురాణం ద్వారా తెలుస్తోంది… మనం ఏ కార్యం తలపెట్టినా, అది ఎటువంటి అవరోధాలు కలుగకుండా, విజయవంతంగా కొనసాగాలని ప్రప్రథమంగా శ్రీ విఘ్నేశ్వరుని ప్రార్ధిస్తాము… సకల సంకటాలనూ తొలగించే గణపతి అనుగ్రహం కోసం సంకట నాశన గణేశ స్తోత్రం భక్తి శ్రద్ధ విశ్వాసాలతో పఠిస్తే, శ్రీ గణేశ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది.
సంకటనాశన గణేశస్తోత్రo
నారద ఉవాచ :…
ప్రణమ్య శిరసా దేవం , గౌరీపుత్రం వినాయకమ్, భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే.
ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్, తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్…
లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ, సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్.
నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్, ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్.
ద్వాదశ ఈతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః, న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికారకం ప్రభో !
విద్యార్థీ లభతే విద్యాం, దనార్థీ లభతే ధనమ్, పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్.
జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్, సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః.
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్, తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః
ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశన గణేశస్తోత్రం సంపూర్ణమ్.
ఓం గం గణపతయే నమః…
శుభమస్తు సమస్త లోకా సుఖినోభవంతు
Commentaires